: శశికళ వర్గానికి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్!

జయలలిత మరణంతో చెన్నైలోని ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో శశికళ వర్గం నుంచి దినకరన్, పన్నీర్ సెల్వం వర్గం నుంచి మధుసూదనన్, జయలలిత మేనకోడలు దీపలతో పాటు బీజేపీ, డీఎండీకే అభ్యర్థులు బరిలోకి దిగారు. దీంతో, ఉపఎన్నికల ప్రచారపర్వం వేడెక్కింది.

ఈ ఉపఎన్నికల సందర్భంగా, అన్నాడీఎంకే పార్టీ గుర్తు అయిన రెండాకులను ఏ వర్గానికీ ఈసీ కేటాయించలేదు. శశి వర్గానికి టోపీ, పన్నీర్ వర్గానికి కరెంట్ స్తంభం గుర్తులను కేటాయించింది. అయితే, శశికళ వర్గం మాత్రం రెండాకుల గుర్తులు విచ్చలవిడిగా వాడుకుంటోంది. సోషల్ మీడియా ప్రచారంలో రెండాకుల గుర్తును ఉపయోగించుకుంటోంది.

ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. తాము కేటాయించిన గుర్తును మాత్రమే వాడుకోవాలని, రెండాకుల గుర్తును వాడుకోరాదంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికితోడు, పార్టీ వెబ్ సైట్ తో పాటు, సోషల్ మీడియా అకౌంట్లు అన్నింటి నుంచి రెండాకుల గుర్తును తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు, తమ ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News