: రామోజీ ఫిల్మ్ సిటీకి 295 ఎకరాల భూమి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరణకు 295 ఎకరాలు కావాలంటూ రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం గతంలో చేసుకున్న దరఖాస్తుపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి కింద భూమిని కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లిలో 250.13 ఎకరాలు, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో 125.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో 295 ఎకరాలు కావాలని ఫిల్మ్ సిటీ యాజమాన్యం తన దరఖాస్తులో పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వాటిని కొనేందుకు సిద్ధమని తెలిపింది. దీంతో ఆ భూములను అప్పగించాలని సర్కారు నిర్ణయించింది. అయితే కొన్ని సర్వే నంబర్ల భూమిలో కొండలు, గుట్టలు ఉండడంతో విభజించడం సాధ్యం కాదని, కాబట్టి మొత్తం 376 ఎకరాలను అప్పగిస్తామని పర్యాటక శాఖకు రెవెన్యూ అధికారులు రాశారు. దీంతో 376.32 ఎకరాలకు అసైన్‌దారులకు పరిహారం కోసం రూ.37.65 కోట్లు డిపాజిట్ చేయాలని ప్రభుత్వం ఫిల్మ్ సిటీ యాజమాన్యాన్ని కోరింది.

More Telugu News