: మెగా బ్యాంకుగా మారిన ఎస్‌బీఐ.. 48 గంటల్లోనే విలీనం పూర్తి

శుక్రవారం వరకు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు సోమవారం అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటిగా రూపాంతరం చెందింది. అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్‌బీఐ ఖాతాదారుల సంఖ్య 50 కోట్లకు చేరుకోగా, 74 కోట్ల ఖాతాలు, 500 టెరాబైట్ల డేటాబేస్‌తో మెగా బ్యాంకుగా అవతరించింది. కేవలం 48 గంటల్లోనే ఆరు అనుబంధ సంస్థలు విలీనం అయినట్టు ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. 48 గంటల్లోనే ఈ స్థాయిలో విలీనం జరగడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి అని తెలిపారు. అనుబంధ బ్యాంకుల డేటాను సూక్ష్మస్థాయి నుంచి సమీకృతం చేసి ఒకే చట్రంలోకి తెచ్చే ప్రక్రియ ఈనెల 24 నుంచి మొదలవుతుందని, మే ఆఖరు నాటికి పూర్తవుతుందని భట్టాచార్య తెలిపారు. ఏప్రిల్ 24 లోగా ఆడిట్ పూర్తవుతుందని, అనంతరం ఒక్కో వారం ఒక్కో బ్యాంకు డేటాను పూర్తిగా విలీనం చేస్తామని భట్టాచార్య వివరించారు.

More Telugu News