: జియో బ్రాడ్‌బ్యాండ్ వేగం ఎంతంటే.. ఐదు నిమిషాల్లోనే సినిమా డౌన్‌లోడ్ !

వేగం విషయంలో రిలయన్స్ జియో మరోమారు అగ్రస్థానాన్ని అలంకరించింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. పోటీ సంస్థలతో పోలిస్తే దాదాపు జియో బ్రాడ్‌బ్యాండ్ వేగం రెట్టింపుగా ఉందని ట్రాయ్ పేర్కొంది. ట్రాయ్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో జియో నెట్ 16.48 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది. జనవరిలో 17.42 ఎంబీపీఎస్‌ వేగాన్ని నమోదు చేసిన జియో ఫిబ్రవరిలో పడిపోయింది. ఐడియా సెల్యులార్ 8.33 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేయగా దేశంలో తమదే ఫాస్టెస్ట్ నెట్‌వర్క్ అని ఊక్లా టెస్ట్‌లో తేలిందని ప్రకటించుకున్న భారతీ ఎయిర్‌టెల్ ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. ఇక జియో నెట్ వేగంతో కేవలం ఐదు నిమిషాల్లోనే ఓ సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ట్రాయ్ పేర్కొంది.

More Telugu News