: శశికళను మరో జైలుకు మార్చాలంటూ వేసిన పిటిషన్ కొట్టివేత!

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే  ప్రధాన కార్యదర్శి శశికళను తుముకూరులోని మహిళా జైలుకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక న్యాయస్థానం కొట్టివేసింది. పరప్పన అగ్రహార జైలు తమిళనాడు రాష్ట్రానికి సమీపంలోనే వుందని, దీంతో రాష్ట్ర ప్రముఖులు పలువురు ఆమెను చూడడానికి జైలుకు వస్తున్నారని, జైలు నుంచే ఆమె పాలన సాగిస్తున్నారని, అందుకని ఆమెను తుముకూరు జైలుకు బదిలీ చేయాలని కోరుతూ, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరప్పన జైలులో ఉన్న శశికళను కలిసేందుకు మంత్రులను అనుమతించవద్దని పిటిషన్‌లో కోరారు. సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. ఆమెను కలిసే వారికి నిబంధనలు వర్తిస్తాయని, అందరికీ ఆమెను కలిసే అవకాశం ఉందని పేర్కొంది.

More Telugu News