: అప్పట్లో నా మీద నమ్మకంతో ఉండటమే మంచిదనుకున్నా: నటి అదా శర్మ

కొత్తగా సినిమాల్లోకి వచ్చిన వారికి ఉచిత సలహాలు ఇచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉంటారని, ఆ సమయంలో వాళ్ల మాటలు వినడం కంటే, తనపై నమ్మకంతోనే ముందుకు వెళ్లడం ముఖ్యమని భావించానని బాలీవుడ్ ప్రముఖ నటి అదా శర్మ చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో ఫలానా హీరోయిన్ లా హెయిర్ స్టైల్ మార్చుకోవాలని, డ్రెస్సింగ్ స్టైల్ ను అనుకరించాలంటూ సూచించే వాళ్లు చాలా మంది తనకు తారసపడ్డారని తెలిపింది. తనను పూర్తిగా మార్చేయాలని ప్రయత్నించే వారని చెప్పింది.

‘మనం చేసే పాత్రలు మనకు నచ్చితే, వాటి ద్వారా ప్రేక్షకులను మెప్పించవచ్చు. అంతే కానీ, ఆ హీరో ఎవరి కొడుకు లేదా ఆ హీరోయిన్ ఎవరు కుమార్తె? అని ఎవరూ ఆలోచించరు. మన టాలెంట్ ను మాత్రమే చూస్తారు...’ అని అదా శర్మ చెప్పుకొచ్చింది. 

More Telugu News