: పగవాడికి కూడా ఇలాంటి ప్రమాదం జరగకూడదు: మొబైల్ ఫోన్ ఛార్జింగ్ భాధితుడు

యువతరం స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ లో వాట్స్ యాప్, ఫేస్ బుక్ ఖాతాలు చూసుకుని బెడ్ పైనే ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారు. ఇంకొందరు ఛార్జింగ్ పెడుతూనే అర్ధరాత్రి దాటినా ఫోన్ లో మాటల్లో మునిగిపోతారు. అలాంటి వారందరికీ అమెరికాలోని హంట్స్‌ విల్లేకి చెందిన విలే డే (32) ఒక సూచన చేస్తున్నాడు. పొరపాటున కూడా అలా చేయవద్దని చెబుతున్నాడు. అలా చేయడానికి కారణమేంటంటే... విల్ డే మొన్న ఒక రోజు బెడ్ మీద ఐఫోన్‌ కి చార్జింగ్ పెట్టి పడుకున్నాడు. గాఢ నిద్రలో ఉండగా అతడి మెడలోని నెక్లెస్ ఐఫోన్ చార్జర్ వైరుకు తగలడంతో అందులోంచి విద్యుత్ ప్రసారమై, తీవ్ర విద్యుదాఘాతానికి గురైన విలే డే గిలగిల కొట్టుకుంటూ ఫ్లోర్ మీద పడ్డాడు. ఒక్కసారిగా చైన్ తెంపుకుని తనంత తానుగా కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లాడు.

 అతనిని పరీక్షించిన వైద్యులు 'అతను బతకడం ఒక అద్భుతం. ఇంత ప్రమాదం జరిగినా అదృష్టంకొద్దీ బతికి బయటపడ్డాడు' అంటూ ఆశ్చర్యపోయారు. దీనిపై విల్ డే మాట్లాడుతూ, ‘‘ నా అనుభవాన్ని బట్టి మిగతావారికి చెప్పేదేమంటే... బెడ్ మీద ఎలక్ట్రానిక్ వస్తువులు చార్జింగ్ పెట్టి పడుకుంటే జీవితం మీద ఆశలు వదులుకున్నట్టే. అలా ఎవరూ చేయవద్దని కోరుతున్నా. పగవాడికి కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు’’ అన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విల్ డే చెబుతూ, ఆ క్షణంలో ఏం జరుగుతోందో అర్థం కాలేదని, మెడచుట్టూ బిగుసుకుపోతున్నట్టు అనిపించిందని, అత్యంత ప్రయత్నం మీద విద్యుత్ కౌగిలి నుంచి విడిపించుకుని బయటపడ్డానని తెలిపాడు. 

More Telugu News