: ప్రపంచంలో అత్యంత అందమైన రెండో మహిళగా బాలీవుడ్ భామ

బాలీవుడ్ నుంచి ఇంటర్నేషనల్ స్టార్ స్థాయికి ఎదిగిన అందాల భామ ప్రియాంక చోప్రా మరో అరుదైన ఘనతను సాధించింది. 2017 సంవత్సరానికి గాను ప్రపంచంలోని అందమైన 30 మంది మహిళల్లో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. హాలీవుడ్ నటి, పాప్ స్టార్ బియాన్స్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రముఖ ఆన్ లైన్ మీడియా సంస్థ 'బజ్ నెట్' ఈ జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా, ప్రియాంక తన అభిమానులతో ఆనందాన్ని పంచుకుంది. బియాన్స్ కు, తనకు అనుకూలంగా ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. తొలి స్థానంలో ఉండటానికి బియాన్స్ అర్హురాలని తెలిపింది. రెండో స్థానాన్ని కైవసం చేసుకునే క్రమంలో ఎమ్మా స్టోన్, ఏంజిలీనా జోలీ, మార్గోట్ రోబీ, బ్లేక్ లైవ్లీ, ఎలిసియా వికందర్ లాంటి హాలీవుడ్ భామలను ప్రియాంక అధిగమించింది.

More Telugu News