: టాప్ లెవల్ లో భారీగా, కింది ఉద్యోగులకు కొంచెమేనా?: 'ఇన్ఫోసిస్' అప్రైజల్ పై నారాయణమూర్తి అసంతృప్తి

సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో అమలు చేస్తున్న అప్రైజల్ విధానంపై సంస్థ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంస్థలో ఉన్నతోద్యోగులకు 60 నుంచి 70 శాతం మేరకు వేతనాలను పెంచుతూ, మిగతావారిలో అత్యధికులకు 6 నుంచి 8 శాతం మాత్రమే జీతాలు పెంచుతున్నారని, ఇది అత్యంత అనైతికమని బోర్డుకు చురకలంటిస్తూ లేఖ రాశారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు సాలీనా రూ. 4.62 కోట్ల వేతనం, ఆపై రూ. 3.88 కోట్ల పరిహారం ఇవ్వాలని డైరెక్టర్లు నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేవలం 24 శాతం మంది ప్రమోటర్లు మాత్రమే రావు వేతన పెంపుపై అనుకూలంగా ఉన్నారని గుర్తు చేసిన ఆయన, బోర్డుపై ఉద్యోగులకు ఉన్న నమ్మకం పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ సిక్కాకు ఇస్తున్న ప్యాకేజీ పెంచిన విషయంలో కూడా బోర్డు డైరెక్టర్ల నిర్ణయంపై తనకు అసంతృప్తిగానే ఉందని నారాయణమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News