: చెప్పినట్టు చేసేందుకైతే గవర్నర్ ఎందుకు? మిషన్ సరిపోతుంది!: సీపీఐ నేత సురవరం

ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెట్టారంటూ ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. తాజాగా, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబువి అత్యంత హీనమైన అవకాశవాద రాజకీయాలని, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు.

గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సీఎం ఇచ్చిన సలహాకు గవర్నర్ అభ్యంతరం చెప్పాల్సింది పోయి, చెప్పినట్టు చేసేందుకు అయితే గవర్నర్ ఎందుకు? ఆయన బదులు ఓ మిషన్ అయినా చాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను గెలిపించుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని, అందుకే, వారితో రాజీనామాలు చేయించడం లేదని విమర్శించారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సవరించాలని సుధాకర్ రెడ్డి సూచించారు. 

More Telugu News