: ఏ బటన్ నొక్కినా బీజేపీకే... మధ్యప్రదేశ్ ఈవీఎంలలో తేడాలు... ఏపీ నుంచి వెళ్లిన ఈసీ టీమ్

ఈ నెల 9న రెండు నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ లో ఈవీఎంలు అనుమానాస్పదంగా ఉండటంతో, ఏపీ నుంచి సాంకేతిక నిపుణులతో కూడిన ప్రత్యేక ఎలక్షన్ కమిషన్ బృందం బయలుదేరి వెళ్లింది. ఈ ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా, బీజేపీకే వెళ్లినట్టు స్లిప్పులు వస్తుండడంతో లోపం ఎక్కడ జరిగిందన్న విషయాన్ని తేల్చేందుకు ఢిల్లీ నుంచి కూడా అధికారులు బయలుదేరారు.

 ఈవీఎంలతో పాటు వీవీపాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రాయిల్)లను కూడా వీరు పరిశీలిస్తారని, అన్ని పార్టీల ప్రతినిధులకూ సంతృప్తి కలిగిన తరువాతే వీటిని వాడతామని అధికారులు తెలిపారు. కాగా, ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని, వీటిని ట్యాంపరింగ్ చేయవచ్చని, బ్యాలెట్ పేపర్లు వాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, ఈవీఎంల పరిశీలన కోసం భన్వర్ లాల్  సహా ఆర్కే శ్రీవాత్సవ, వీరేంద్ర కుమార్ లు హైదరాబాద్ నుంచి వెళ్లారని తెలుస్తోంది.

More Telugu News