: నా కూతురి కంటే దేశవాళీ పోటీలు ఎక్కువా?: రైనా ప్రశ్న

తన కుమార్తె గ్రేసియా కోసమే ఇన్నాళ్లూ దేశవాళీ టోర్నీల్లో ఆడలేదని టీమిండియా టీ20 స్పెషలిస్టు బ్యాట్స్ మన్ సురేష్ రైనా తెలిపాడు. తన కుమార్తె అస్వస్థతకు గురైందని తెలిపాడు. ఈ విషయం రాష్ట్ర బోర్డుకు, బీసీసీఐకి తెలిపానని చెప్పాడు. బీసీసీఐ కాంట్రాక్టుల్లో రైనాకు చోటు కల్పించని సందర్భంగా, ఆటను నిర్లక్ష్యం చేశాడని, వ్యక్తిగత వ్యాపారాలు చూసుకుంటున్నాడని వార్తా కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రైనా మాట్లాడుతూ, ‘నా కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఇంట్లోనే ఉండి ఈ పని చేయాలి. దీనికి నన్ను విమర్శిస్తారని అనుకోలేదు. రాష్ట్ర సెలెక్టర్లకు, బీసీసీఐకి ఈ విషయం చెప్పాను. అందుకే కొన్ని రంజీ, దులీప్‌ మ్యాచ్‌ లు ఆడలేదు. ఇంటివద్ద ఉండి నేను కాకపోతే మరెవరు నా కూతుర్ని చూసుకుంటారు? కుటుంబం ఉన్న ఎవరైనా ఇలాగే చేస్తారు. షాహిద్ కపూర్ కూతుర్ని చూసుకునేందుకు ఆరు నెలలు పనికి విరామమిచ్చాడు. హర్బజన్ కూడా పనులన్నీ పక్కనపెట్టాడు’ అంటూ గుర్తు చేశాడు. 

More Telugu News