: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సత్యంబాబు.. రిసీవ్ చేసుకున్న తల్లి!

ఆయేషా మీరా హత్యకేసులో నిందితుడిగా 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి, హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా మారిన పి.సత్యంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. సత్యంబాబును తీసుకెళ్లేందుకు అతని తల్లి మరియమ్మ, న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా సత్యంబాబు తల్లి మాట్లాడుతూ, తన కుమారుడు నిర్దోషిగా విడుదల కావడం ఆనందంగా ఉందని అన్నారు. ఇన్నేళ్లు తన కుమారుడు అన్యాయంగా శిక్ష అనుభవించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇది వంద శాతం పోలీసుల వైఫల్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులో తీర్పుతో న్యాయవ్యవస్థపై ప్రజల్లో గౌరవం పెరిగిందని ఆయన అన్నారు. చేయని నేరానికి 8 ఏళ్ల విలువైన జీవితం కోల్పోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి పరిహారం అందించాలని అన్నారు. ఈ కేసులో అసలైన దోషులను పట్టుకునేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. 

More Telugu News