: మరో మూడు నెలలు రైలు ప్రయాణికులకు ఊరట... ఆన్ లైన్ లో రైలు టికెట్లపై సర్వీస్ చార్జీల్లేవ్

ఆన్ లైన్ లో ఐఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా రైలు టికెట్లు కొనుగోలు చేసే వారికి ఊరట లభించింది. నేటి నుంచి మరో మూడు నెలల పాటు టికెట్ల కొనుగోలుపై సర్వీసు చార్జీలు వసూలు చేయడం లేదంటూ రైల్వే శాఖ స్పష్టం చేసింది. డీమోనిటైజేషన్ తర్వాత ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఐఆర్టీసీ సేవా రుసుములను ప్రభుత్వ సూచనల మేరకు రైల్వే శాఖ మార్చి వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు దీన్ని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. అంటే కేవలం టికెట్ చార్జీ మాత్రమే వసూలు చేస్తారు. దీనికి అదనంగా పేమెంట్ గేట్ వే చార్జీలు సుమారు రూ.11 మేర చెల్లించుకోవడం మినహా ఇతరత్రా ఎటువంటి చార్జీలు ఉండవు.

More Telugu News