: సౌందర్యతో నాకు అఫైర్ లేదంటే ఎవరూ నమ్మరు.. ఆ అఫైర్ అర్థం వేరు!: జగపతిబాబు

కొన్నేళ్ల క్రితం హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన నాటి అందాల నటి సౌందర్యను ప్రేక్షకులు మరచిపోలేరు. నటుడు జగపతిబాబు, సౌందర్య చాలా సన్నిహితంగా ఉండే వారని, వాళ్లిద్దరి మధ్య ‘అఫైర్’ నడుస్తోందనే వదంతులు నాడు హల్ చల్ చేశాయి. ఈ విషయమై జగపతిబాబు ఇటీవల ప్రస్తావిస్తూ, తాను మహిళలను ప్రేమిస్తానని,అందులో ఎటువంటి అనుమానం లేదన్నాడు. తాను ఎప్పుడూ దొడ్డి దోవలో వెళ్లనని, తనది ఎప్పుడూ రాజమార్గమేనని అన్నాడు. తాను, ఆ విధంగా వెళ్లినప్పుడు తనను అందరూ ఫోకస్ చేశారని చెప్పాడు.

సౌందర్య గురించి చెప్పాలంటే, తమ మధ్య అఫైర్ లేదంటే ఎవరూ నమ్మరేమోనని, అయితే, సౌందర్య, ఆమె సోదరుడు తనకు మంచి మిత్రులని చెప్పారు. తనను వారి కుటుంబసభ్యుడిలా భావించేవారని, అదేవిధంగా, ప్రతి విషయంలోనూ తాను వారి కుటుంబంలో ఒకడిలా ఉన్నానని చెప్పాడు. ఆమెకు, తనకు అఫైర్ అంటే.. ఓ మంచి స్నేహమని, అఫైర్ అంటే కేవలం సెక్స్ ఒక్కటే కాదని, అలా ఆలోచించే వాళ్లు కచ్చితంగా మతి భ్రమించిన వాళ్లేనని చెప్పుకొచ్చారు. మగవాళ్లకు మహిళలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా? అని జగపతిబాబు ప్రశ్నించారు. సౌందర్యతో తనకు అఫైర్ ఉందని, అయితే, ఆ అఫైర్ అందరూ అనుకునేది కాదంటూ ఆ ఇంటర్వ్యూలో జగపతిబాబు స్పష్టం చేశారు.

More Telugu News