: ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలతో దారికొస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు

ఉత్తరప్రదేశ్ లో కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు ఉదయం 9.30 గంటలకే వచ్చేస్తున్నారు. ఉద్యోగులు ఎవరూ కార్యాలయాల వద్ద పాన్లు, గుట్కాలు తినడానికి వీల్లేదంటూ సీఎం జారీ చేసిన ఆదేశాలను సైతం పాటిస్తున్నారు. తినే నోరు ఊరికే ఉండదన్నట్టు గుట్కాలకు బదులు వారు చూయింగ్ గమ్ లను తెచ్చుకుంటున్నారు. బుధవారం ఉదయం సెక్రటేరియట్ వద్ద 9.30 గంటలకే కనీసం ఒక్క వాహనం పార్క్ చేయడానికి కూడా ఖాళీలేనంతగా ప్యాక్ అయిపోయింది.

గుట్కాలు, పాన్ మసాలాల అలవాటున్న ఉద్యోగులు చూయింగ్ గమ్, చాక్లెట్లను తెచ్చుకుంటున్నారని విధాన సభ వద్ద ఉన్న ఓ ప్యూన్ వెల్లడించాడు. ‘ఇక్కడ మీపై కెమెరా నిఘా ఉంది. గుట్కా తింటే రూ.1,000 జరిమానా చెల్లించుకోవాల్సిందే’ అంటూ రాష్ట్ర అటవీ శాఖ సెక్రటేరియట్ వద్ద కారిడార్లలో పోస్టర్లను అంటించింది. రోజులో 18 నుంచి 20 గంటల పాటు పనిచేయడానికి ఉన్నతాధికారులు సిద్ధంగా ఉండాలని, కార్యాలయ ఫైళ్లను ఇంటికి తీసుకెళ్లవద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్ హాజరు యంత్రాలను కూడా ప్రవేశపెట్టారు.

More Telugu News