: టెన్త్ పేపర్ లీక్ వైకాపా కుట్ర... నేను చండశాసనుడిని: చంద్రబాబు

పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ వెనుక వైకాపా కుట్ర దాగుందన్న అనుమానాలు తనలో ఉన్నాయని, ఈ మొత్తం సాక్షి మీడియా, తన విలేకరులతో చేయించిన స్టింగ్ ఆపరేషన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఈ కేసులో స్టింగ్ ఆపరేషన్ జరిగిందన్న అంశంపైనా విచారణకు ఆదేశిస్తానని చెప్పారు.

"దీని వెనుక ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఆలోచన కూడా ఉందేమో... ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేపిస్తా. ఒకటే అధ్యక్షా, మీ కోసం ఎంక్వైరీలు కాదు. ప్రజల కోసం ఎంక్వైరీలు చేయిస్తా. నేను చండశాసనుడిగా ఉంటాను తప్ప... ఎవరైనా సరే, తప్పు చేస్తే ఉపేక్షించను. తప్పుడు లెక్కలు చూపించి జైలుకు పోయిన వారు మీరు, మమ్మల్ని గురించి మాట్లాడుతారా అధ్యక్షా" అంటూ జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. సమస్యని సమస్యగా చూడాలే తప్ప, బురద చల్లాలనుకుంటే మాత్రం అది వారిపైనే పడుతుందని, బురదలో కూరుకుపోయిన వారికి, పక్కవారిపై బురద చల్లే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.

More Telugu News