: ముంబైలో కాలేజీ విద్యార్థుల వద్ద భారీగా పట్టుబడ్డ మత్తుమందులు

ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మత్తు మందులను స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు ప్రముఖ కాలేజీల విద్యార్థులు కూడా ఉన్నారు. వెస్ట్రన్ సబర్బ్ ప్రాంతంలో పట్టుకున్న వీరి నుంచి రూ.70 లక్షల విలువ చేసే లిసెర్జిక్ యాసిడ్ డైఎతిలమైడ్ (ఎల్ఎస్ డీ) అనే డ్రగ్ ను స్వాధీనం చేసుకుంది. వీరు ఈ మత్తు పదార్థానికి బానిసలుగా మారడమే కాకుండా దాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎల్ఎస్ డీని యాసిడ్ స్టాంప్స్ గా తయారు చేసిి విక్రయిస్తున్నారు. ఇవి పోస్టల్ స్టాంపుల మాదిరిగానే ఉంటాయి. నాలుక కింద పెట్టుకుంటే రెండు గంటల్లో మత్తు తారస్థాయికి చేరుతుంది. 12 గంటల పాటు ఇది ఉంటుంది.

More Telugu News