: అగ్రీగోల్డ్ కంపెనీకి ప్రభుత్వం వత్తాసు పలికింది: పవన్ కీలక ఆరోపణ

పేదల నుంచి పెట్టుబడులు స్వీకరిస్తున్న అగ్రీగోల్డ్ పెద్దలకు ప్రభుత్వం వత్తాసు పలికినట్టు తనకు స్పష్టంగా అర్థమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇటువంటి సంస్థలు బాగా పనిచేస్తున్నాయని ప్రభుత్వ పెద్దలు చెప్పడం, వారిని పిలిచి అవార్డులు ఇవ్వడం తదితరాల కారణంగా, ఏజంట్లు సైతం ఇవి మంచి కంపెనీలని నమ్మి ప్రజల్లోకి వెళ్లి పెట్టుబడులు సేకరించారని చెప్పారు. ఒక్క రోజులో ఈ తరహా సూట్ కేస్ కంపెనీలను ఎత్తేస్తే, గ్రామాల్లోని ఏజంట్లు, తమకేమీ సంబంధం లేదని చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని, అదే అగ్రీగోల్డ్ బాధితుల వ్యధని పవన్ అన్నారు.

 గతంలో అగ్రీగోల్డ్ ఫంక్షన్స్ కు వెళ్లి, వాళ్ల భుజం తట్టిన పెద్దలు, ఇప్పుడు తమకేమీ సంబంధం లేదన్నట్టు వెనక్కు తిరిగి వెళ్లిపోయారని పవన్ ఆరోపించారు. ఏపీలో 1.40 లక్షల మంది ఏజంట్లు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. చట్టాలను బలంగా అమలు చేయకపోవడం వల్లే, ఏ తప్పూ చేయలేని ఏజంట్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సహారా కేసులో సుప్రీం కల్పించుకున్నట్టుగానే ఈ కేసులో చేసి వుండాల్సిందని అభిప్రాయపడ్డారు.

More Telugu News