: బ్యాంకులన్నీ బాదుతున్న వేళ... జీరో చార్జ్ ఖాతాలను ప్రకటించిన కోటక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఎన్నో బ్యాంకులు ఖాతాదారుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్న వేళ, కోటక్ మహీంద్రా బ్యాంకు జీరో చార్జ్, జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను అందించనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాదిన్నరలో తమ కస్టమర్ల సంఖ్యను 1.6 కోట్లకు పెంచుకోవాలన్న లక్ష్యంతో ఈ ఖాతాలను అందించాలని నిర్ణయించామని, ఈ ఖాతాల్లో జరిపే ఎటువంటి డిజిటల్ లావాదేవీపైనా ఎటువంటి రుసుములూ ఉండవని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ తెలిపారు. కొత్త ప్లాన్ కు '811' అని పేరు పెట్టామని, మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తామని, దీన్ని కేవలం ఐదు నిమిషాల్లో ఏ శాఖలోనైనా ప్రారంభించుకోవచ్చని, ఆధార్ ఆధారిత వన్ టైం పాస్ వర్డ్ ను అందిస్తామని, ఆధార్, పాన్ కార్డు తీసుకొచ్చి ఈ ఎకౌంటును ప్రారంభించుకోవచ్చని తెలిపారు. ఖాతాల్లోని మొత్తంపై 6 శాతం వార్షిక వడ్డీని అందిస్తామని ఉదయ్ కోటక్ తెలిపారు.

More Telugu News