: ఆర్టీసీ బస్సుల నంబర్ ప్లేట్లపై ‘జడ్’ అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?

ఎప్పుడైనా మీకీ అనుమానం వచ్చిందా? ఆర్టీసీ బస్సుల నంబరు ప్లేట్లపై ‘జడ్’ అనే అక్షరం ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయంలో క్లారిటీ కావాలంటే ఒక్కసారి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గురించి చెప్పుకోవాలి. 82 సంవత్సరాల క్రితం ఆయన నిజాం స్టేట్ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఇందుకోసం రూ.3.93 లక్షలు వెచ్చించి 27 బస్సులు కొనుగోలు చేశారు. అయితే ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పడిన తర్వాత 1958లో ఆ బస్సులను సంస్థకు ఇచ్చేశారు. ఈ సందర్భంగా సంస్థతో ఓ ఒప్పందం చేసుకున్నారు. ప్రతి బస్సుపై ‘జడ్’ అనే అక్షరం ఉండాలని షరతు పెట్టారు.  దీని వెనక కూడా ఓ కథ ఉంది. మీర్ ఉస్మాన్ తల్లి పేరు జొహ్రాబేగం. తల్లంటే విపరీతమైన ప్రేమ ఉన్న ఉస్మాన్ ఆమె పేరులోని మొదటి అక్షరం ‘జడ్’ అన్ని బస్సులపై ఉండాలని ఆర్టీసీని కోరారు. అలా అప్పటి నుంచి ఆ  సంస్థ నంబర్ ప్లేట్లపై ‘జడ్’ కొనసాగుతూ వస్తోంది.

More Telugu News