: రూ. 97 కోట్లు కట్టాల్సిందేనంటూ కేజ్రీవాల్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తాఖీదులు

ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చిత్రాలను ప్రచురించినందుకు నెల రోజుల్లోగా రూ. 97 కోట్లను చెల్లించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ముఖ్యమంత్రికి తాఖీదులు పంపారు. నెల రోజుల్లో ఈ డబ్బును వసూలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంఎం కుట్టిని ఆయన ఆదేశించారు. ఈ ప్రకటనలకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు చెల్లించారని గుర్తు చేసిన ఆయన, నిబంధనలు ఉల్లంఘించినందున ఆ డబ్బులు తిరిగి ఖజానాకు జమ చేయాలని ఆదేశించారు.

కాగా, ఎల్జీ నోటీసులు ఇంకా తమకు చేరలేదని, నోటీసులను అందుకున్న తరువాతే తాము ఈ విషయంపై స్పందిస్తామని ఆప్ వర్గాలు వెల్లడించాయి. కాగా, 2015లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ పథకాల ప్రకటనల్లో ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోటోలు మాత్రమే ఉండాల్సి వుంది. ఆపై పలు రాష్ట్రాలు సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేయడంతో ఉత్తర్వుల అమలును వాయిదా వేసింది.

More Telugu News