: స్పష్టత లేని డ్రైవర్ ఎంపవర్‌మెంట్ పథకం.. కార్ల రుణాలకు బ్రేక్!.. దరఖాస్తులు అటకెక్కినట్టేనా?

ఉబెర్ క్యాబ్ సంస్థ సమన్వయంతో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన డ్రైవర్ ఎంపవర్‌మెంట్ పథకంపై స్పష్టత కరువవడంతో వివిధ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఇవ్వదలచిన కార్ల రుణాలకు బ్రేక్ పడింది. 2016-17లో ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నిరుద్యోగుల నుంచి 21,910 దరఖాస్తులు స్వీకరించాయి. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నా లబ్ధిదారుల ఎంపిక మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు కరువవడంతో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2017-18 బడ్జెట్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండడంతో కార్పొరేషన్లు కొత్త ప్రణాళికలు రూపొందించాయి. దీంతో ప్రస్తుత పథకాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఈ క్రమంలో డ్రైవర్ ఎంపవర్‌మెంట్ స్కీంలోనూ మార్పులుచేర్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ఇప్పటి వరకు స్వీకరించిన ధరఖాస్తుల పని అంతేసంగతులు!

More Telugu News