: భయపడితే సుడిగుండంలో కొట్టుకుపోతాం: చంద్రబాబు

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, స్పీకర్ కోడెల, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ పంచాంగాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం పోలవరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  సమస్యలు ఉన్నాయని భయపడుతూ కూర్చుంటే సుడిగుండంలో కొట్టుకుపోతామని అన్నారు. సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని, అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని చెప్పారు. మరే ఇతర దేశానికి లేని గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు భారతీయులకు సొంతమని తెలిపారు.

తెలుగు భాష మన ఉనికిని, గొప్పదనాన్ని కాపాడుతుందని చంద్రబాబు అన్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ఓ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూచిపూడికి పూర్వ వైభవం తెచ్చేందుకు రూ. 100 కోట్లతో నాట్యారామం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు. ప్రతి వర్షపు నీటి చుక్కను భూగర్భజలాలుగా మార్చాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు మూడు లక్షల పంట కుంటలు తవ్వామని చెప్పారు. మరో 5 లక్షల కుంటలను తవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని అన్నారు.

More Telugu News