: ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ఉచితంగా ఖాతాదారులు అందరికీ...!

ఎటువంటి వార్షిక ఫీజులు లేవు. చక్కని క్రెడిట్ హిస్టరీ (గతంలో రుణాలు తీసుకుని నిర్ణీత సమయంలో వైఫల్యం లేకుండా తీర్చేసిన చరిత్ర) అవసరం లేదు. అప్లికేషన్ పెట్టుకుంటే చాలు ఇంటికే నేరుగా క్రెడిట్ కార్డు వచ్చేస్తుంది. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్ బీఐ తన ఖాతాదారులకు చేసిన తాజా ఆఫర్ ఇది. కాకపోతే ఇందులో ఒకే ఒక్క తిరకాసు ఉంది. కనీసం 20,000 నుంచి రూ.25,000 వరకు నగదు నిల్వలను తమ ఖాతాల్లో ఎప్పుడూ ఉంచాల్సి ఉంటుంది. అటువంటి వారే తాజా ఆఫర్ కు అర్హులని ఎస్ బీఐ తెలిపింది.

ఈ కార్డుకు ఉన్నతి అనే పేరు పెట్టింది. కార్డు జారీ సమయంలో ఎటువంటి చార్జీలను వసూలు చేయరు. అలాగే మెదటి నాలుగేళ్లు వార్షిక రుసుములు కూడా ఉండవు. ఆ తర్వాత బ్యాంకు నిర్ణయించిన మేరకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రుణ చరిత్ర అనే అంశం కార్డుల వినియోగ విస్తరణకు అడ్డుగా ఉంది. నూతన వినియోగదారుల క్రెడిట్ హిస్టరీకి ఈ కార్డు ఉపయోగపడుతుందని ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు.

More Telugu News