: భారత్, పాక్ లలో విపరీతమైన మత పిచ్చి... చైనాలో అత్యల్పం

పాకిస్థాన్ లో 93 శాతం, భారత్ లో 80 శాతం మంది తమ జీవితంలో మతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆఫ్రికా దేశం ఇథియోపియాలో అత్యధికంగా 98శాతం మంది తమ మతానికి ప్రధాన్యతను ఇస్తున్నారు. మతం గురించి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయన్న సర్వేను 2015లో 'ప్యూ రీసెర్చ్ సెంటర్' నిర్వహించింది. ఇథియోపియాలో ప్రతి 100 మందిలో 98 మంది మతం తమకు చాలా ప్రాధాన్యమైనదని భావిస్తున్నారు. అగ్రదేశం అమెరికాలో 53 శాతం మంది, జర్మనీలో 21 శాతం, రష్యాలో 19 శాతం, ఫ్రాన్స్ లో 14 శాతం మంది తమ మతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మత పిచ్చి చైనాలో అందరికన్నా అతి తక్కువగా ఉంది. కేవలం 3 శాతం మందే ఈ దేశంలో తమ మతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగిలిన వారు మతాలను పట్టించుకోవడం లేదు.

More Telugu News