: అక్కడ ఉగాది పండుగకి దూరం!

హిందువులకు ఉగాది అత్యంత పర్వదినం. యుగాదికి గుర్తుగా, కొత్త సంవత్సరారంభంగా ఈ విశిష్ట రోజును సంతోషంగా, భక్తి భావంతో జరుపుకుంటుంటారు. పంచాంగ శ్రవణాలు, ఈ ఏడాదిలో తమ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని చాలా మందికి ఎంతో ఆసక్తి. ఇక ఉగాది పచ్చడి అంటే చెవి కోసుకునే వారు ఎందరో. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఈ పండుగను నిండుగా జరుపుకోవడం చూస్తుంటాం.

కానీ, అనంతపురం జిల్లాలో ఆత్మకూరు మండలం కురుబల అడ్డాలో పరిస్థితి కాస్త భిన్నం. ఇక్కడ కొన్ని తెగల వారు ఉగాది పండుగ అనర్థంగా భావిస్తారట. తమ ఇలవేల్పు అయిన గంగవరదప్ప ఆలయానికి తాళం వేసి, ముళ్ల కంప కట్టేసి పండుగ వెళ్లిన తర్వాత గానీ తెరవరు. శతాబ్దాలుగా ఈ ఆచారాన్ని వారు తూచ తప్పకుండా పాటిస్తున్నారు.  

More Telugu News