: దేశంలో రూ. లక్ష కోట్ల శత్రు ఆస్తులు.. వెల్లడించిన కేంద్రం

దేశంలో లక్ష కోట్ల రూపాయల విలువ చేసే శత్రువుల ఆస్తులు ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 11,773 ఎకరాల్లో 9,280 స్థిర శత్రు ఆస్తులు ఉన్నట్టు పేర్కొంది. వీటి విలువ రూ.1.04 కోట్లని తెలిపింది. మంగళవారం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ సమాధానమిస్తూ ఈ వివరాలు వెల్లడించారు.

1965లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం తర్వాత 1968లో శత్రు ఆస్తుల చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. దేశం నుంచి పాకిస్థాన్, చైనాకు వలస వెళ్లిపోయిన వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తులను శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు. కేంద్ర ప్రభుత్వంలోని ఓ శాఖ వీటిని పర్యవేక్షిస్తుంది. ఈ చట్ట సవరణకు ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ఈ ఆస్తులను వారి వారసులు, ఇతరులకు బదిలీ చేయడాన్ని చట్టపరంగా అడ్డుకోనున్నారు.

More Telugu News