: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్‌డీ కార్డు విడుద‌ల‌.. ధరల వివరాలు

సోని ఇండియా ఎస్ఎఫ్-జీ సిరీస్‌లో వరల్డ్ ఫాస్టెస్ట్ ఎస్‌డీ కార్డును విడుద‌ల చేసింది. మొత్తం మూడు వేరియంట్లలో విడుద‌లైన‌ ఈ కార్డు ప్రొఫిషనల్ ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించారు. ఈ ఎస్డీ కార్డు రైటింగ్ స్పీడు సెకనుకు 299 ఎంబీపీఎస్ వరకు ఉంటుందని, రీడింగ్ స్పీడు కూడా సెకనుకు 300 ఎంబీపీఎస్ వరకు ఉంటుంద‌ని సోని ప్ర‌తినిధులు తెలిపారు. డిజిటల్ ఇమేజింగ్ డివైజ్ లన్నింటికీ తమ ఎస్ఎఫ్-జీ సిరీస్ కార్డులు సపోర్టు చేస్తాయని పేర్కొన్నారు.

డీఎస్ఎల్ఆర్‌తో 4 వేల వీడియోలను ఈ కార్డు రికార్డు చేయ‌గ‌ల‌ద‌ని తెలిపారు. ఈ కార్డుతో పాటు ఎస్‌డీ మెమరీ కార్డు రీడర్ ను కూడా కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటితో డేటాను చాలా వేగంగా పర్సనల్ కంప్యూటర్లోకి ట్రాన్సఫర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్డులన్నింటికీ ఐదేళ్ల వారెంటీ ఉంటుంద‌ని తెలిపారు. వ‌చ్చేనెల 3 నుంచి వినియోగదారుల‌కు ఇవి అందుబాటులో వుంటాయి.

మూడు వేరియంట్ల‌లో ప్ర‌వేశ‌పెట్టిన ఎస్‌డీ కార్డు ధ‌ర‌లను ప‌రిశీలిస్తే..
ఎస్ఎఫ్‌-జీ32/టీ1(32కెపాసిటీ) ధర- రూ. 6700
64జీబీ కెపాసిటీ ఎస్ఎఫ్-జీ64/టీ1 ఐఎన్ కార్డు ధర- రూ.11,000
128జీబీ కెపాసిటీ కార్డు ధర- రూ.19,900

More Telugu News