: ‘ముస్లిం’గా పుట్టి హిందువుగా మారిన ఆ మఠాధిపతి యూపీ సీఎం కు సన్నిహితుడు!

గత ఏడాది డిసెంబర్ లో గుజరాత్ విస్ నగర్ లోని నట సంప్రదాయ ఆశ్రమ మఠాధిపతి గులబ్ నాథ్ బాపు పరమపదించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు, గులబ్ నాథ్ బాపు గురించిన ప్రస్తావన ఎందుకంటే.. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు ఆయన అత్యంత సన్నిహితుడు. గోరఖ్ పూర్ లోని ఆశ్రమ మఠాధిపతి అవైద్యనాథ్ వద్ద యోగి ఆదిత్యనాథ్ శిష్యరికం చేశారు. అయితే, గులబ్ నాథ్ అప్పటికే మఠాధిపతి అయ్యారు. గోరఖ్ పూర్ ఆశ్రమ మఠాధిపతి అవైద్యనాథ్ తో గులబ్ నాథ్ కు అవినాభావ సంబంధాలు ఉండటంతో ఆయన వద్ద గులబ్ నాథ్ శిష్యరికం చేశారు.

 ఆ సమయంలో, ఆదిత్యనాథ్ కు గులబ్ నాథ్ సహ విద్యార్థి (గురుభాయ్) అయ్యారు. దీంతో, వారి మధ్య సాన్నిహిత్యం, అవినాభావసంబంధాలు ఉన్నాయి. గులబ్ నాథ్ గురించి ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ‘ముస్లిం’ కుటుంబంలో పుట్టిన ఆయన అసలు పేరు గుల్ మహ్మద్ పఠాన్. తన పద్దెనిమిదేళ్ల వయసులో మఠాధిపతి బాలక్ నాథ్ విధానాలకు, ‘హిందూ’ సంప్రదాయాలకు గుల్ మహ్మద్ ఆకర్షితుడై, హిందూ మతాన్ని స్వీకరించి దీక్ష చేపట్టారు. నాటి నుంచి ఆయన పరమపదించే వరకు హిందూ సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆశ్రమంలో ఉండిపోయారు.

More Telugu News