: ఆస్ట్రేలియాను వణికిస్తున్న భారీ తుపాను.. సురక్షిత ప్రాంతాలకు 25 వేల మంది తరలింపు!

భారీ తుపాను ఆస్ట్రేలియాను వణికిస్తోంది. ఆ దేశ నైరుతి ప్రాంతంలో సంభవించిన తుపాను ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తుపాను ప్రభావంతో గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. క్వీన్స్‌లాండ్ వైపు నుంచి దూసుకొస్తున్న ఈ గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎగసిపడుతున్న సముద్రపు అలల ధాటికి భారీ ఆస్తి నష్టం సంభవించింది. తుపానుతో అప్రమత్తమైన ప్రభుత్వం 25 వేల మంది తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

More Telugu News