: నేటి మ్యాచ్ లో అశ్విన్, జడేజా ప్రపంచ రికార్డులివే!

టీమిండియా స్టార్ స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్...రవీంద్ర జడేజాలు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుంచి క్రికెట్ సీజన్ మొదలవుతుంది. మార్చి 31తో క్రికెట్ సీజన్ ముగుస్తుంది. ఈ ఏడు టీమిండియా క్రికెట్ సీజన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ తో ముగియనుంది. ఈ మేరకు టీమిండియా బౌలర్ల బౌలింగ్ నైపుణ్యం ఈ రోజుతో ఈ ఏడాదికి ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ లో ఏప్రిల్ 1 నాటికి టీమిండియా మళ్లీ ఆడే అవకాశం లేకపోవడంతో... ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ లో రెండు వికెట్లు తీసిన అశ్విన్... ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ లలో కలిపి నాలుగు వికెట్లు తీశాడు. దీంతో ఈ 2016-17 సీజన్‌ లో మొత్తం 81 వికెట్లు తీశాడు. దీంతో ఒక సీజన్‌ లో అత్యధిక వికెట్లు తీసిన వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌ గా నిలిచాడు. అతని తరువాతి స్థానంలో సౌతాఫ్రికా బౌలర్ డెల్ స్టెయిన్ 2007/08 సీజన్‌ లో 78 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో రవీంద్ర జడేజా నిలిచాడు.

టీమిండియా మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. ఒకే సీజన్‌ లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసి 50 వికెట్లు కూడా తీసిన మూడో బౌలర్‌ గా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా స్ధానం సంపాదించుకున్నాడు. జడేజా కంటే ముందు ఈ ఘనతను ఇద్దరు ఆల్‌ రౌండర్లు మాత్రమే సాధించారు. వారిలో ఒకరు టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ (1979-80లో) కాగా, మరో ఆటగాడు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్‌ (2008-09లో) మాత్రమే. ఈ సీజన్ లో 71 వికెట్లు తీసిన జడేజా 500 పైగా పరుగులు చేశాడు. 

More Telugu News