: ఎస్టాబ్లిష్ మెంట్ లైసెన్స్ లేని జిమ్ లకు ఇకపై కష్టకాలమే!

ఎస్టాబ్లిష్ మెంట్ లైసెన్స్ లేని జిమ్ లకు ఇకపై కష్టకాలమేనని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. త్వరలోనే జిమ్ లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నామని, రెండు నెలల్లోగా ప్రతి జిమ్ లో సంబంధిత లైసెన్స్ ఉండి తీరాలని ఆదేశించారు. ఎస్టాబ్లిష్ మెంట్ లైసెన్స్ లేని జిమ్ లపై కఠిన చర్యలు తప్పవని, తమ కమిషనరేట్ పరిధిలోని జిమ్ లకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. ప్రతి జిమ్ యజమాని తమ కమిషనరేట్ లో నమోదు చేయించుకోవాలని సూచించారు. మహిళలు, పురుషులకు వేర్వేరు జిమ్ ఇన్ స్ట్రక్టర్లను నియమించుకోవాలని, జిమ్ లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని మహేశ్ భగవత్ హెచ్చరించారు.

More Telugu News