: యూపీలో కబేళాల మూసివేతపై ప్రశ్నించిన అసదుద్దీన్ ఒవైసీ

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కొలువుదీరిన ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం ప‌లు కీల‌క చ‌ర్య‌లు తీసుకుంటూ ముందుకు వెళుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆ రాష్ట్రంలోని ప‌రిస్థితిపై హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ రోజు లోక్‌స‌భ‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల‌ మాంసం ఎగుమతులు తగ్గిపోతాయని అన్నారు. నిరుద్యోగం కూడా పెరుగుతుందని చెప్పారు. భార‌త్ నుంచి చైనాకు గొడ్డు మాంసాన్ని ఎగుమ‌తి చేస్తున్నామ‌ని, అలాంటప్పుడు ఎగుమతులను నిషేధించాలనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు.

 అస‌దుద్దీన్‌ ఒవైసీ అడిగిన ప్ర‌శ్న‌లపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స‌మాధానం చెబుతూ.. ఆ రాష్ట్రంలో అక్రమ కబేళాలను మాత్రమే నిషేధించిన‌ట్లు తెలిపారు. లైసెన్స్ ఉన్న కబేళాలు నడుస్తూనే ఉన్నాయ‌ని చెప్పారు.

More Telugu News