: దాదాగిరి చేస్తున్న ఎయిర్ లైన్స్... తీవ్ర ఆరోపణలు చేసిన శివసేన... అడ్డుకున్న అశోక్ గజపతిరాజు

భారత విమానయాన రంగంలో తమ దాదాగిరిని చూపించేందుకే ఓ ఎంపీని విమానాలు ఎక్కకుండా నిషేధించారని రాజ్యసభలో శివసేన సభ్యులు విరుచుకుపడ్డారు. రవీంద్ర గైక్వాడ్ ఉదంతాన్ని ప్రస్తావించిన శివసేన సభ్యుడు ఆనందరావ్, ఈ విషయంలో స్పీకర్ కల్పించుకోవాలని, పరిస్థితిని ఆయన చక్కదిద్దకుంటే, హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడతామని హెచ్చరించారు. విమానంలో మద్యం సేవించి హంగామా చేసిన కపిల్ శర్మపై చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. శివసేనకు మద్దతుగా ఇతర పార్టీల సభ్యులు సైతం మాట్లాడారు. ప్రజా ప్రతినిధిని ఇలా నిషేధించడం, తప్పుడు సంకేతాలను పంపుతుందని చెప్పారు. ఆ సమయంలో కల్పించుకున్న విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, దేశీయ విమానయాన రంగంలో రెగ్యులేషన్స్ చాలా పటిష్ఠంగా ఉన్నాయని, ఓ పార్లమెంట్ సభ్యుడు ఇలా ప్రవర్తిస్తాడని తాను కలలో కూడా అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎయిర్ లైన్స్ తప్పున్నట్టు తాను భావించడం లేదని, జరిగిన సంఘటనకు కనీసం చింతిస్తున్నట్టయినా గైక్వాడ్ చెప్పి ఉండాల్సిందని సలహా ఇచ్చారు.

More Telugu News