: మీకు హిమాన్ష్, మాకు దేవాన్ష్... బాల్క సుమన్ తో రేవంత్ సరదా కబుర్లు!

తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురైన, తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, ఈ ఉదయం అసెంబ్లీకి రాగా, ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు. లాబీల్లోకి వెళ్లిన రేవంత్ కు, ఎంపీ బాల్క సుమన్ ఎదురుపడగా, వారిద్దరి మధ్యా ఆసక్తికర సంభాషణ జరిగింది. సస్పెన్షన్ అమల్లో ఉండగా, ఎలా లోపలికి రానిచ్చారని సుమన్ అడుగగా, హిమాన్ష్ చెప్పడం వల్ల తనను రానిచ్చారని రేవంత్ సరదా వ్యాఖ్యలు చేశారు.

"నన్ను రానివ్వాలని హిమాన్ష్ వాళ్ల తాతకు చెప్పాడు కాబట్టే ఇక్కడి దాకా అనుమతించారు. మీలాంటి స్నేహితులకన్నా హిమాన్ష్ బెటర్" అని అన్నారు. "అలాగా... మీకు హిమాన్ష్ ఉంటే, మాకు దేవాన్ష్ ఉన్నాడు" అని బాల్క సుమన్ చెప్పడంతో అక్కడున్న వారిలో నవ్వాగలేదు. ఆపై పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ఎందుకు వెళ్లలేదని బాల్క సుమన్ ను ప్రశ్నించారు. పార్టీ పనుల్లో బిజీగా ఉండటంతోనే తాను వెళ్లలేదని చెప్పిన సుమన్, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News