: 100 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన పాకిస్థాన్

వంద మంది మత్స్యకారులను పాకిస్థాన్ బంధించింది. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న కారణంతో వీరందరినీ అరెస్ట్ చేసింది. వీరికి చెందిన 18 బోట్లను అదుపులోకి తీసుకుంది. గుజరాత్ కచ్ జిల్లా పరిధిలో ఉన్న జకావ్ సముద్ర తీర ప్రాంతంలో చేపలు పడుతున్న సందర్భంగా వీరిని పాక్ సముద్ర తీరప్రాంత గస్తీ దళం అదుపులోకి తీసుకుంది. వంద మంది భారతీయ మత్స్యకారులను పాక్ బలగాలు అధీనంలోకి తీసుకున్న విషయాన్ని నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరమ్ కార్యదర్శి మనీశ్ లోధారి నిర్ధారించారు. వారి నుంచి తప్పించుకున్న కొందరు మత్స్యకారులు ఈ విషయాన్ని తమతో చెప్పారని తెలిపారు మత్స్యకారులను విడిపించేందుకు పాక్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. 

More Telugu News