: 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడన్నది ఎంత సస్పెన్సో ఇది కూడా అంతే సస్పెన్స్!: కృష్ణంరాజు భార్య

'బాహుబలి' లాంటి సినిమా ఒక నటుడి కెరీర్ లో ఒక్కసారి మాత్రమే వస్తుందని ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు తెలిపారు. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న 'బాహుబలి- ది కన్ క్లూజన్' ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన కెరీర్ లో 200కు పైగా సినిమాల్లో నటించానని అన్నారు. అయితే అందులో గొప్ప సినిమాలు ఏవి అంటే ఒక పదో లేక ఇరవయ్యో ఉంటాయని అన్నారు. అయితే వాటిల్లో 'బాహుబలి' లాంటి సినిమా లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఈ సినిమాకు నిజమైన 'బాహుబలి' రాజమౌళి అని ఆయన చెప్పారు. దర్శకుడు 'కెప్టెన్ ఆఫ్ ది షిప్' అని ఆయన చెప్పారు. దర్శకుడు తనకేం కావాలో దానిని ప్రతినటుడి నుంచి రాబట్టుకుంటాడని చెప్పారు. మరి ప్రభాస్ పెళ్లి సంగతేంటని అడగడంతో... కృష్ణంరాజు భార్య స్పందిస్తూ... 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడన్నది ఎంత సస్పెన్సో ఇది కూడా అంతే సస్పెన్స్ అని అన్నారు. దీంతో కృష్ణంరాజు పెద్దగా నవ్వేశారు.

More Telugu News