: యూపీలో బీఫ్ కు మద్దతుగా మటన్, చికెన్ బంద్

ఉత్తరప్రదేశ్ లో కబేళాల మూసివేత నిర్ణయం రాజకీయ రంగు పులుముకుంటోంది. అక్రమ కబేళాలు మూసివేయాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలివ్వగానే కదిలిన అధికార యంత్రాంగం వివిధ ప్రాంతాల్లో పెట్టిన కబేళాలను మూసివేయించింది. వారికి మద్దతుగా బీఫ్ వ్యాపారులు తమ వ్యాపారాలు నిలిపేశారు. వారికి మద్దతుగా టుండే, రహీం వంటి పట్టణాల్లో మటన్, చికెన్ వ్యాపారులు కూడా ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కబేళాల విషయంలో పట్టుదలకు పోతే సోమవారం నుంచి తమ ఆందోళన తీవ్రమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. లక్షాలాది మంది కార్మికులు ఈ కబేళాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వారు తెలిపారు. వారి జీవనోపాధిపై దెబ్బకొట్టే చర్యలను వ్యతిరేకిస్తున్నామని మాంసం వ్యాపారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి దీనిపై సానుకూలంగా ఆలోచించాలని వారు సూచించారు. 

More Telugu News