: అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న పుజారా!

బ్యాటింగ్ కు కఠినమైన పిచ్ పై టీమిండియా బ్యాట్స్ మన్ జాగ్రత్తగా ఆడుతున్నారు. ధర్మశాల పిచ్ పేస్ కు స్వర్గధామం వంటిదని, బ్యాటింగ్ కు అనువైనదని గ్రౌండ్స్ మన్ చెప్పిన మాటలు ఒట్టివేనని తేలింది. తొలిరోజు కాస్త బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ రెండో రోజు కఠినంగా తయారైంది. పిచ్ పై ఊహించని బౌన్స్, వేగం బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాట్స్ మన్ జాగ్రత్తగా ఆడుతున్నారు.

ఓపెనర్లు మురళీ విజయ్ (11), కేఎల్ రాహుల్ (60)ను ఆసీస్ బౌలర్లు ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టారు. దీంతో విజయ్ ను హాజిల్ వుడ్ పెవిలియన్ బాట పట్టించగా, అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రాహుల్ ను కమ్మిన్స్ పెవిలియన్ కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర్ పుజారా (53) అర్థసెంచరీతో రాణించగా, టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే (19) డిఫెన్స్ తో బౌలర్లను విసిగిస్తున్నాడు. దీంతో రెండో సెషన్ ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్, కుమ్మిన్స్ చెరొక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 

More Telugu News