: గవర్నర్ వద్ద పంచాయితీ... ఏపీ నుంచి యనమల, అచ్చెన్నాయుడు, టీఎస్ నుంచి హరీశ్, జగదీష్

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన వివాదాలను పరిష్కరించే క్రమంలో ఈ ఉదయం గవర్నర్ వద్ద ఏపీ, టీఎస్ మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. ఏపీ తరఫున యనమల, అచ్చన్నాయుడు, విప్ కాల్వ శ్రీనివాసులు హాజరు కాగా, తెలంగాణ నుంచి హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశానికి వచ్చారు. వీరి మధ్య ఉద్యోగ విభజనపై ప్రధానంగా చర్చ సాగగా, ఎటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోలేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఏప్రిల్ 17న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు యనమల తెలిపారు. తమ సీఎంతో మాట్లాడిన తరువాత సచివాలయం, అసెంబ్లీ, మండలి భవనాల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామని, విద్యుత్ వివాదంపై రెండు రాష్ట్రాల మేనేజింగ్ డైరెక్టర్లు నివేదికలు రెడీ చేశారని, తదుపరి సమావేశంలో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు.

More Telugu News