: 12.5 లక్షల మంది ప్రజలకు, 70 వేల మంది వ్యాపారులకు బహుమతులు ఇచ్చాం: మోదీ

ఇండియాలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నగదు రహిత కొనుగోళ్లు జరిపే వారికి నగదు బహుమతులు ఇస్తున్నామని గుర్తు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇంతవరకూ 12. 5 లక్షల మంది ప్రజలు, 70 వేల మంది వ్యాపారులకు బహుమతులు ఇచ్చామని తెలిపారు. నేడు 'మన్ కీ బాత్'లో భాగంగా మాట్లాడిన మోదీ, స్వచ్ఛ భారత్ మీద సలహాలు తనకు ఇంకా వస్తున్నాయని తెలిపారు.

డెహ్రాడూన్ కు చెందిన గాయత్రి అనే తొమ్మిదేళ్ల బాలిక, తమ నదిని కలుషితం చేస్తున్నారన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని, చుట్టూ ఉన్న మురికిని చూసి ఇప్పుడు భారతీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని, అది పరిశుభ్ర భారతావని సాకారానికి తొలి అడుగని చెప్పారు. 2030 నాటికి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కలను సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎటువంటి అభిప్రాయాలనైనా ఇతరులతో పంచుకుంటే ఒత్తిడి తగ్గుతుందని ప్రజలకు సలహా ఇచ్చారు. గర్భవతులైన ఉద్యోగినులకు 26 వారాల సెలవును ప్రకటించిన మోదీ, సాలీనా 18 లక్షల మందికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని తెలిపారు. 3వ యోగా డేను ఘనంగా నిర్వహించుకునేందుకు ఏం చేయాలన్న విషయమై తన మొబైల్ యాప్ ద్వారా సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు.

More Telugu News