: చెన్నై జయ దుర్గ గుడిలో ప్రసాదమంటే బర్గర్, పఫ్, శాండ్ విచ్

చెన్నై శివార్లలోని పడప్పాయ్ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న గుడి అది. ఆ గుడిలో జయ దుర్గ అమ్మవారిని కొలుస్తారు. విశేషం ఏమిటంటే, అక్కడ ప్రసాదమంటే పులిహోర, దద్దోజనం, పొంగలి వంటివి ఉండవు. బర్గర్ లు, బ్రౌనీలు, శాండ్ విచ్ లు, పఫ్ లు వంటి వాటిని అందిస్తారు. ఇదే ఈ ఆలయాన్ని మిగతా ఆలయాలకన్నా ప్రత్యేకంగా నిలిపింది. ఇక్కడ ఇచ్చే ప్రసాదాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పరిశీలిస్తుంటారు కూడా.

వాటిని ఎప్పుడు తయారు చేశారు? ఎంతకాలంలోగా వాటిని వినియోగించాలన్న విషయాలను ప్రసాదాల కవర్లపై రాసుంటుంది. టూరిస్టులను, స్థానికులను ఆకర్షించేందుకు తాము ఈ ఆలోచన చేశామని గుడి నిర్వాహకుల్లో ఒకరైన కే శ్రీధర్ వెల్లడించారు. దేవాలయానికి రెగ్యులర్ గా వచ్చే భక్తుల పుట్టిన రోజు తేదీలతో రిజిస్టర్ నిర్వహిస్తున్నామని, వారి పుట్టిన రోజు నాడు బర్త్ డే కేకును ప్రసాదంగా పంపుతున్నామని తెలిపారు.

More Telugu News