: అంతర్జాతీయ సరిహద్దులను మూసేస్తాం: రాజ్ నాథ్ కీలక ప్రకటన

దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా చూసేందుకు పాకిస్థాన్, బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను మూసేయనున్నట్టు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సాధ్యమైనంత త్వరగా ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ఉగ్రవాదులను, పెద్ద సంఖ్యలో వలసలు వస్తున్న వారిని అడ్డుకునేందుకు ఇండియా తీసుకున్న కీలక నిర్ణయం సరిహద్దుల మూసివేతేనని ఆయన అభివర్ణించారు. 2018లోగా, పాకిస్థాన్ తో సరిహద్దులన్నీ మూసివేయాలని యోచిస్తున్నామని తెలిపారు. కేంద్ర హోం శాఖ, బీఎస్ఎఫ్ సంయుక్తంగా మూసివేసిన సరిహద్దులను పర్యవేక్షిస్తాయని ఆయన అన్నారు. దేశ భద్రతలో బీఎస్ఎఫ్ జవాన్లు అత్యంత కీలకమని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

More Telugu News