: పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్టాలిన్ కుట్ర.. తీవ్రస్థాయిలో ఆరోపించిన దినకరన్

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారును కూల్చేందుకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కుట్ర చేస్తున్నారని అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తున్న విషయం బయటపడిందని ఆయన తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. శనివారం రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయ్యన్, మంత్రులు, ఎమ్మెల్యేలతో దినకరన్ సమావేశమయ్యారు.

గంటపాటు సాగిన ఈ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. అయితే వీరిని బుజ్జగించేందుకే పిలిచి ఉంటారని సమాచారం. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దినకరన్ స్టాలిన్‌పై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయన కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. పన్నీర్ సెల్వానికి మద్దతుగా ఆయన కుట్రలు సాగుతున్నాయని దినకరన్ తీవ్రస్థాయిలో ఆరోపించారు.

More Telugu News