: ఆ హీరోకి నేను వీరాభిమానిని: విక్టరీ వెంకటేష్

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన తాజా చిత్రం గురు ఈ నెల 31న విడుద‌లకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో వెంక‌టేష్‌ మాట్లాడుతూ... త‌న ఫేవ‌రేట్ హీరో గురించి చెప్పాడు. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బచ్చన్‌కి తాను వీరాభిమానినని అన్నాడు. ఆయ‌న‌ నటించిన బ్లాక్, పీకు సినిమాలు తన ఆల్ టైమ్ ఫేవరేట్స్ అని చెప్పాడు. అంతేకాకుండా తాను అనుకరించాలనుకుంటున్న వాటిల్లోనూ ఆ సినిమాలు ఉన్నాయ‌ని అన్నాడు. ఇక తాజాగా ఆయ‌న న‌టించిన గురు సినిమా గురించి మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో తాను న‌టించిన సినిమాల్లో తనకి బాగా నచ్చిన పాత్ర ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్‌గా చేయడమ‌ని అన్నాడు.

More Telugu News