: న్యూయార్క్ టైమ్స్ కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం

ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ ను హిందూ దేశంగా మార్చే కుట్రలో భాగంగా బీజేపీ అధిష్ఠానం దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ను నియమించిందని ఆరోపిస్తూ అమెరికా ప్రముఖ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' ప్రచురించిన సంపాదకీయంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన సంపాదకీయం స్వీయ పరిశీలనే కానీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని రాసిన కథనం కాదని భారత ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఈ ఎంపికను ప్రశ్నించే విధానం ఇది కాదని భారత ప్రభుత్వం తన అభ్యంతరం తెలిపింది. యోగి ఆదిత్యనాథ్‌ ను ఫైర్ బ్రాండ్ హిందూ క్లరిక్ అని పేర్కోవడం సరికాదని భారత ప్రభుత్వం న్యూయార్క్ టైమ్స్ కు సూచించింది. 

More Telugu News