: వార్నర్ ను పెవిలియన్ కు పంపిన కుల్ దీప్ యాదవ్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను ధర్మశాల టెస్టుతో అరంగేట్రం చేసిన స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. తొలి సెషన్ లో ఓపెనర్ రెన్ షా (1) ను ఉమేష్ యాదవ్ పెవిలియన్ కు పంపగా, రెండో సెషన్ లో బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు అరంగేట్ర ఆటగాడు కుల్ దీప్ యాదవ్ షాకిచ్చాడు. లెగ్ స్టంప్ పై పడేలా ఎక్స్ ట్రా బౌన్స్ తో కుల్ దీప్ యాదవ్ సంధించిన అద్భుతమైన ఫుల్లర్ బాల్ ఆఫ్ స్టంప్ మీదకు దూసుకురావడంతో బ్యాక్ పుట్ లో బంతిని డిఫెండ్ చేయబోయిన వార్నర్ బ్యాట్ ను ముద్దాడుతూ కీపర్ వృద్ధిమాన్ సాహాను దాటుకుని వెళ్తున్న బంతి కెప్టెన్ అజింక్యా రహానే చేతుల్లో వాలిపోయింది. దీంతో కీలక సమయంలో టీమిండియాకు మరోసారి బ్రేక్ లభించింది. 87 బంతులాడిన వార్నర్ (56) పెవిలియన్ చేరాడు. అనంతరం స్టీవ్ స్మిత్..  షాన్ మార్ష్ జతకలిశాడు. 35 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, కల్ దీప్ యాదవ్ చెరొక వికెట్ తీశారు. 

More Telugu News