: జర్మనీలో అతిపెద్ద కృత్రిమ సూర్యుడు?.. ప్రయోగానికి సిద్ధం!

జర్మనీలో ప్రపంచంలోనే అతిపెద్ద ‘కృత్రిమ సూర్యుడితో’ ప్రయోగాలు చేసేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు ప్రారంభించారు. భారీ శ్రేణి కాంతి కిరణాల ద్వారా నీటి అణువులను విక్షేపణం చెందించి, పర్యావరణ ప్రియమైన హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు నడుం బిగించారు. అందుకోసం 140 జినాన్ లైట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ లైట్లను సినీ తరహా స్పాట్‌ లైట్ల కోసం ఉపయోగిస్తారు. 8 అంగుళాల దూరంలో మొత్తం ఈ 140 లైట్లను తేనెపట్టు రంధ్రాల మాదిరిగా జతకలిపి వెలుతురు ప్రసరించేలా చేస్తారు. తద్వారా సాధారణ సూర్యకాంతి కంటే పది వేల రెట్లు అధికంగా ఈ లైట్లు కాంతిని విరజిమ్ముతాయి. దీంతో వీటి నుంచి 3 వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉత్పన్నమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో నీటి అణువులను విక్షేపణం చెందించి హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయనున్నారు. ఇది పర్యావరణ హితమైనదని వారు చెబుతున్నారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న ఇంధన కొరతను ఈ హైడ్రోజన్ ఇంధనం తీరుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 

More Telugu News