: ఇక్కడి పరిస్థితిని 'ఉడ్తా పంజాబ్'లా మార్చబోం: కర్ణాటక హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

తమ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న ‘డ్రగ్స్ అంశంపై చర్చ’లో కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర పంజాబ్‌లోని ప‌రిస్థితిని ఉద‌హ‌రిస్తూ ప‌లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త‌మ రాష్ట్రాన్ని 'ఉడ్తా పంజాబ్'లా మారనివ్వ‌బోమ‌ని పేర్కొన్నారు. అసెంబ్లీలో డ్రగ్స్ అంశాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీ సభ్యులు ప్రస్తావించినప్పుడు ఆయనిలా ఘాటైన‌ జ‌వాబు ఇచ్చారు. క‌ర్ణాట‌క‌లో డ్ర‌గ్స్ అనే మాటే లేకుండా ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టామని తెలిపారు. బెంగళూరు, మంగళూరు నగరాల్లో ముఖ్యంగా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. బెంగళూరు న‌గ‌రాన్ని పంజాబ్ మార్గంలో నడవనివ్వ‌బోమ‌ని చెప్పారు. డ్రగ్ పెడ్లర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల‌ని పోలీసులకు చెప్పామ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే రెండు నెల‌ల్లో 65 మంది భారతీయులు, 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నామ‌ని అన్నారు.

More Telugu News